కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ప్రొఫెసర్ కృష్ణమూర్తి

  0
  10

  కేంద్ర ప్రభుత్వ నూతన ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ నియమితులయ్యారు.

  ఈ మేరకు డిసెంబర్ 7న కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది.
  దీంతో కేంద్ర ప్రభుత్వ సీఈఏగా కృష్ణమూర్తి మూడు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం సీఈఏగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ 2018 జూలైలో తన పదవిని వీడారు. పారిశ్రామికాభివృద్ధి, విదేశీ వాణిజ్యం, పారిశ్రామిక ఉత్పత్తి, ప్రధాన ఆర్థిక విషయాల ప్రకటనల్లో కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైన సూచనలు, సలహాలను సీఈఏ ఇవ్వాల్సి ఉంటుంది.

  ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సుబ్రమణియన్ ప్రస్తుతం బంధన్ బ్యాంకు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకు మేనేజ్‌మెంట్, ఆర్‌బీఐ అకాడమీ బోర్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతకుముందు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ గవర్నెన్‌‌స కమిటీ, రిజర్‌‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంకింగ్ గవర్నెన్‌‌స కమిటీల్లో పనిచేశారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్, రీసెర్చ్ విషయాల్లో సెబీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు.