కెనడా హాల్ ఆఫ్ ఫేమ్ లో భారతీయ రైతు

    0
    12

    కెనడాకి చెందిన ‘కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ (సీఏహెచ్ఎఫ్ఏ)’లో భారతీయ రైతు పీటర్ పావిటర్ ధిల్లాన్ కు చోటు లభించింది.

    కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన కృషికిగాను భారతీయ రైతుకు కెనడాలో అరుదైన గౌరవం దక్కింది.
    • ‘కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ (సీఏహెచ్ఎఫ్ఏ)’ లో రైతు పీటర్ పావిటర్ ధిల్లాన్ పేరును చేర్చారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారి పేరును సీఏహెచ్ఎఫ్ఏలో చేర్చి వారి విజయాలను ఆ సంస్థ ప్రచారం చేస్తుంది.
    • కెనడాలోనే అత్యధిక క్రాన్బెర్రీ పంటను పండించినందుకుగాను ధిల్లాన్ ను సంస్థ ఇలా గౌరవించింది. పంజాబ్, హోషియార్పూర్లోని పాండోరి గ్రామం నుంచి 1950లో ధిల్లాన్ తండ్రి రాచ్పాల్ సింగ్ ధిల్లాన్ కెనడాకి వచ్చారు.
    • 19 ఏళ్ళ వయస్సులోనే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ లో చేరిన తొలి ఇండో కెనడియన్ గా పీటర్ ధిల్లాన్ గుర్తింపు పొందాడు.
    • అనతి కాలంలో డిప్యూటీ షరిఫ్ గా ధిల్లాన్ ఎదిగారు. బ్రిటన్లో లా పూర్తిచేశాక ధిల్లాన్ కుటుంబం 1993లో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ధిల్లాన్ 2000 ఎకరాల్లో క్రాన్బెర్రీ పండిస్తున్నారు.
    • ప్రపంచంలోనే అత్యధిక క్రాన్బెర్రీ సాగుచేస్తున్నవారిలో ధిల్లాన్ రెండో స్థానంలో ఉన్నారు. రిచ్మండ్, బ్రిటిష్ కొలంబియాల్లో రిచ్బెర్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో క్రేన్బెర్రీ ఉత్పాదక పరిశ్రమలను నిర్వహిస్తున్నారు.
    • 2017లో రిచ్బెర్రీ గ్రూప్ రూ.188 కోట్ల విలువైన క్రాన్బెర్రీను పండించింది. అమెరికా, కెనడా ల్లోని క్రాన్బెర్రీ మార్కెటింగ్ కో-ఆపరేటివ్ ‘ఓషియన్ స్ప్రే’క్యి ప్రస్తుతం దిల్లాన్ చైర్మన్. 2014లో తొలిసారిగా దిల్లాన్ ఓషియన్ స్ప్రేకో ఆపరేటివ్ సొసైటీకి శ్వేతజాతీయేతర చైర్మన్ గా ఎంపికై రికార్డు సృష్టించారు.