కిలోగ్రామ్ కు సరికొత్త నిర్వచనం

  0
  17

  ప్రపంచవ్యాప్తంగా బరువును కొలిచేందుకు వాడుతున్న కిలోగ్రామ్(కేజీ) ప్రమాణం నిర్వచనాన్ని మార్చేందుకు ఫ్రాన్స్ లో సమావేశమైన 50 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి.

  • దీంతో పాటు విద్యుత్ ప్రవాహానికి వాడే ఆంపియర్, ఉష్ణోగ్రతకు వాడే కెల్విన్, పదార్థ రాశిని కొలిచేందుకు వాడే మోల్ ప్రమాణాల నిర్వచనాలను సవరించాలని నిర్ణయించాయి. ఫ్రాన్స్ లోని వర్సయిల్స్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు.
  • 1889 నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్ లోని ఓ హైసెక్యూరిటీ లాకర్లో భద్రపరిచిన ప్లాటినం-ఇరీడియం అల్లాయ్ గోళాన్ని ఇప్పటి వరకు కేజీకి ప్రమాణంగా పరిగణిస్తూ వచ్చారు.
  • ఈ లోహపు వస్తువు కిందపడ్డా, మరే కారణంచేత అయినా దెబ్బతిన్నా కేజీ బరువులో మార్పు జరిగే అవకాశముండేది. ఈ నేపథ్యంలో తాజా నిర్వచనం ప్రకారం కేజీని ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండేలా డిజిటల్ మాధ్యమంలో సంఖ్య రూపంలో తెలియజేయనున్నారు.
  • ఈ నిర్ణయం కారణంగా ప్రజల జీవితాల్లో పెద్దగా వచ్చే మార్పేమీ ఉండబోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2019 మే 20 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తాయన్నారు.