కార్టూనిస్ట్ నర్సింహకు జాతీయ పురస్కారం

    0
    11

    నవ తెలంగాణ దినపత్రిక కార్టూన్ ఎడిటర్ పి.నర్సింహకు ‘నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం-2018’ పురస్కారం లభించింది.

    ఈ మేరకు నూఢిల్లీలో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్(పీసీఐ) జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈ పురస్కారాన్ని అందించారు. బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమైన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం జంట గడ్డి పూలు క్రమంగా మార్పునకు లోనై కత్తులుగా మారి కొట్లాడుతున్నాయంటూ నర్సింహ గీసిన కార్టూన్కు ఈ పురస్కారం లభించింది. నర్సింహ గతంలో ‘ఇండియా టుడే’లో 23 ఏళ్ల పాటు పనిచేశారు.

    మరోవైపు రాజారామ్మోహన్ రాయ్ జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ‘ది హిందూ’పత్రిక పూర్వ సంపాదకుడు ఎన్.రామ్ అందుకున్నారు. అలాగే గ్రామీణ జర్నలిజంలో మధ్యప్రదేశ్కు చెందిన రూబీ సర్కార్, మహారాష్ట్రకు చెందిన పరశురామ్ జోష్టే సంయుక్తంగా అందుకున్నారు. కేరళకు చెందిన వి.ఎస్.రాజేశ్ అభివృద్ధి వార్తల విభాగంలో, న్యూఢిల్లీకి చెందిన మిహిర్ సింగ్ ఫోటో ఫీచర్లో అవార్డులు అందుకున్నారు. జాతీయ పత్రికా దినోత్సం(నవంబర్ 17)ని పురస్కరించుకుని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ అవార్డులని ప్రకటించింది.