కన్నడ నటుడు అంబరీశ్ కన్నుమూత

  0
  14

  ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్ (66) కన్నమూశారు.

   

  గుండెపోటు కారణంగా బెంగళూరులో నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు. 200కు పైగా చిత్రాల్లో నటించిన అంబరీశ్ పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగానూ ఎన్నికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు చేపట్టారు.

  1952 మే 29న మండ్య జిల్లా మద్దూరు తాలుకా దొడ్డరాసినకెరెలో జన్మించిన అంబరీశ్ అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్‌నాథ్. 1994లో రాజకీయాల్లో ప్రవేశించిన అంబరీశ్ 1998, 1999, 2004లో మండ్య నుంచి ఎంపీగా గెలిచారు. 2012లో కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కన్నడలో 205 చిత్రాల్లో నటించిన అంబరీశ్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో కలిపి మొత్తం 230 సినిమాల్లో నటించారు. 1992లో ప్రముఖ తెలుగు నటి సుమలతను వివాహం చేసుకున్నారు. 1972లో విడుదలైన తన తొలి చిత్రం నాగరహావు సినిమాకే అంబరీశ్ జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే 2005లో ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2009లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును స్వీకరించారు.