కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం

  0
  12

  వెఎస్సార్ జిల్లా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నవంబర్ 6న ఆమోదం తెలిపింది.
  ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  ఈ కార్పొరేషన్ మేనేజింగ్ లిమిటెడ్ డెరైక్టరుగా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎండీగా పని చేసిన పి.మధుసూధన్ ను నియమించింది. కార్పొరేషన్ కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12,000 కోట్లుగా అంచనా వేసింది.

  మరోవైపు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం మెట్రో ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దానిని నిర్మించేందుకు జారీచేసిన ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2,395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని కూడా తామే సొంతంగా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోైవె పు గ్రామీణ ప్రాంతాల్లో రూ.22 వేల వ్యయంతో తాగునీటి సరఫరా చేయాలని కేబినేట్ నిర్ణయించింది. కూడా ‘అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని తీర్మానించింది.