ఓఐసీ సదస్సుకు సుష్మా స్వరాజ్

  0
  8

  అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) రెండు రోజుల సదస్సుకు భారత్ తరఫున విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మార్చి 1న హాజరయ్యారు.

  దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న తొలి భారత మంత్రిగా సుష్మా గుర్తింపు పొందారు. పంచాన్ని ప్రమాదంలోకి నెడుతూ.. దేశాలను అస్థిర పరుస్తోన్న ఉగ్రవాదంపైనే తమ యుద్ధం తప్ప మతాలకు వ్యతిరేకంగా కాదని భారత్‌ స్పష్టం చేసింది. అరబ్‌ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) రెండు రోజుల సదస్సుకు భారత్‌ తరఫున విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ హాజరయ్యారు.

  ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు 130 కోట్ల మంది భారతీయుల అభినందనలు, ప్రత్యేకంగా 18 కోట్ల మంది ముస్లిం సోదరసోదరీమణుల శుభాకాంక్షలను ఇక్కడికి తీసుకొచ్చాను. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేందుకు మా దేశ ముస్లిం సోదరసోదరీమణులే నిదర్శనం.

  పాకిస్థాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్’ సదస్సును బహిష్కరించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విశిష్ట అతిథిగా హాజరుకానుండటమే దీనికి కారణం.

  ఈ సందర్భంగా ఖురేషీ మాట్లాడుతూ, యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడానని…. సుష్మాస్వరాజ్ ఈ సదస్సుకు హాజరవుతుండటంపై అభ్యంతరాలను వివరించానని చెప్పారు. మరోవైపు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లో 57 సభ్య దేశాలు ఉన్నాయి. కశ్మీర్ పై మొదటి నుంచి పాకిస్థాన్ కు ఓఐసీ సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది.