ఒకటి, రెండు తరగతులకు ఇంటి పని ఇవ్వకూడదు – ఎన్ హెచ్ ఆర్ డి

  0
  14

  ఒకటి, రెండు తరగతుల పిల్లలకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎన్ హెచ్ ఆర్ డి ) స్పష్టం చేసింది.

   ఈ మేరకు ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల సంచులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ నవంబర్ 27న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

  ఎన్ హెచ్ ఆర్ డి ఆదేశాలు ప్రకారం…
  • జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి.
  • 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి.
  • విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని చెప్పకూడదు.
  • ఎన్సీఈఆర్టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి.

  పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 2006లోనే చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు ఎలాంటి బరువులతో కూడిన పుస్తకాల సంచులను మోయకూడదు. పై తరగతులకు చెందిన విద్యార్థులు తమ శరీర బరువులో పుస్తకాల సంచి బరువు పది శాతానికి మించకూడదు.