ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం స్థానములో భారత్

  0
  7

  *వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో ఉత్తమ జట్టుగా నిలిచి ఛాంపియన్‌షిప్‌ సాధించింది. విజేతకు బహుమతిగా ఇచ్చే గదతో పాటు మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది.

  ఏప్రిల్‌ 1 నాటికి ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకే ఈ గద లభిస్తుంది. కోహ్లి సేన 116 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

  న్యూజిలాండ్‌ (108) రెండో స్థానం

  దక్షిణాఫ్రికా (105) మూడో స్థానం

  ఆస్ట్రేలియా (104) నాలుగో స్థానం

  ఈ ఏడాది నుంచి ఐసీసీ కొత్తగా టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనుంది.

  ఇందులో భాగంగా తొమ్మిది దేశాలు రాబోయే రెండేళ్లలో 27 సిరీస్‌ల్లో 71 టెస్టు మ్యాచ్‌లు ఆడతాయి. వీటిలో ప్రదర్శన ఆధారంగా 2021లో విజేతను ప్రకటిస్తారు.

  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భారత్‌కు చెందిన మను సాహ్ని ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టారు.
  2012 నుంచి ఈ పదవిలో ఉన్న డేవ్ రిచర్డ్సన్ వచ్చే వన్డే వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా బాధ్యతలనుంచి తప్పుకోనుండగా… అప్పటి వరకు ఆయనతో కలిసి సాహ్ని పని చేస్తారు.

  ఈఎస్‌పీఎన్ స్టార్ స్పోర్‌‌ట్స సంస్థలో సుదీర్ఘ కాలం పని చేసిన సాహ్నికి ప్రసారహక్కులు, మార్కెటింగ్ వంటి అంశాలలో భారీ ఆదాయం తెచ్చి పెట్టిన అనుభవం ఉంది.