ఐర్లాండ్ రచయిత్రికి మ్యాన్‌ బుకర్‌

    0
    10

    ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ను ఈ ఏడాదికి ఐర్లాండ్‌ రచయిత్రి అన్నా బర్న్స్‌(56) గెలుచుకున్నారు. ఆమె రచించిన ‘మిల్క్‌ మ్యాన్‌’ నవలకు ఈ అవార్డు దక్కింది.

      20వ శతాబ్దం చివరినాళ్లలో ఉత్తర ఐర్లాండ్‌లో జాత్యంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరతకాలంలో ఓ యువతి, వివాహితుడితో సంబంధం ఏర్పర్చుకున్న ఇతివృత్తంతో ఈ నవల సాగుతుంది.మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ 49 ఏళ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్‌ మహిళగా అన్నా గుర్తింపు పొందారు.
    లండన్‌లో మంగళవారం (Oct16) జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో అన్నా బర్న్స్‌కు ఈ అవార్డు కింద రూ. 50.85 లక్షల చెక్కు, ట్రోఫీ బహూకరించారు.