ఐదు హైకోర్టులకు సీజేల నియామకం

  0
  15

  దేశంలోని ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల(సీజే)ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేశారు.

  దీంతో ఉత్తరాఖండ్, బాంబే, కలకత్తా, గువాహటి, సిక్కిం హైకోర్టులకు నూతన సీజేలు నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

  కొత్తగా నియమితులైన సీజేలు

  ఉత్తరాఖండ్ హైకోర్టు – జస్టిస్ రమేశ్ రంగనాథన్

  సిక్కిం హైకోర్టు – జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్

  కలకత్తా హైకోర్టు – డీకే గుప్తా

  గువాహటి హైకోర్టు – ఏ సోమయ్య బోపన్న

  బాంబే హైకోర్టు – జస్టిస్ నరేశ్ హరిశ్చంద్ర పాటిల్