ఐక్యరాజ్యసమితి ఇండియన్ పర్మనెంట్ మిషన్ డిప్యూటీ చీఫ్ గా నాగరాజునాయుడు

    0
    3

    ఐక్యరాజ్యసమితిలో ఇండియన్ పర్మనెంట్ మిషన్ డిప్యూటీ చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ ఐఎఫ్ఎస్ అధికారి కాకనూరు నాగరాజు నాయుడు నియమితులయ్యారు.

    • డిల్లీలోని విదేశాంగశాఖ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి (పశ్చిమ ఐరోపా)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాగరాజునాయుడును కేంద్ర ప్రభుత్వం న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గా నియమించింది. నాగరాజు నాయుడి స్వస్థం చిత్తూరు జిల్లా మదనపల్లి.
    • తల్లిదండ్రు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడటంతో అక్కడే విద్యాభ్యాసం సాగింది. నిజాం కళాశాలో బీఏ ఆనర్స్ లో టాపర్ గా నిలిచి బంగారు పతకం సాధించారు. సివిల్స్ సర్వీస్ పరీక్షలు రాసి విజయం సాధించారు. 1998లో ఐ.ఎఫ్.ఎస్.
    • అధికారిగా నియమితులయ్యారు. 13 ఏళ్లు చైనాలో పని చేయడం వల్ల చైనా భాషపై పూర్తిపట్టు సాధించారు. తర్వాత దిల్లీలో భారత విదేశాంగ కార్యాలయంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఎకనమిక్ డిప్లొమసీ విభాగానికి నేత ృత్వం వహించారు.
    • ప్రధానమంత్రి మానస పుత్రిక ‘ఇంటర్నేషనల్ సోలార్ అయన్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం భారత్ లో ఏర్పాటు చేసిన ఆ సంస్థకు తొలి చీఫ్ కోఆర్డినేటర్ గా సేవలందించారు.