ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ ఔట్‌లుక్‌ 2019 నివేదిక

    0
    4

    ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ ఔట్‌లుక్‌ 2019 నివేదిక ప్రకారం 2019-20లోనూ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగనుందని వెల్లడించింది.

    దేశీయంగా చూస్తే పన్ను వసూళ్లు తగ్గడం,అంతర్జాతీయ గిరాకీ మందగించడం,కీలక రేట్ల కోత, రైతులకు ఆదాయ దన్ను వంటి కారణాల వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

    బలహీన వ్యవసాయ ఉత్పాదకత, వినియోగం, అధిక చమురు ధరలు, తక్కువ ప్రభుత్వ వ్యయాలు ప్రభావం చూపాయని తెలిపింది. 2019లో వృద్ధి 7.2 శాతానికి పెరగొచ్చని, 2020లో 7.3 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది

    ఆహార వస్తువులు ధరలు, దేశీయ గిరాకీ వంటి వాటి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4.3 శాతానికి చేరుతుంది. 2020-21కి 4.6 శాతానికి చేరుతుంది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 2.4 శాతానికి , 2020-21 నాటికి 2.5 శాతంగా ఉంటుందని నివేదించింది.

    ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా మరియు పసిఫిక్ దేశాలకు రుణాలు, గ్రాంట్లు, విధాన సాయం, సాంకేతిక సహాయం మరియు ఈక్విటీ పెట్టుబడులను అందించే ఒక అంతర్జాతీయ సంస్థ.

    ఇది 22 ఆగష్టు 1966 న ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకు లాగా స్థాపించబడింది మరియు దీని ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్ లో ఉంది.

    ఎడిబి దాని స్థాపన సమయంలో 31 సభ్య దేశాలు ఉండేవి, ఇప్పుడు 67 సభ్య దేశాలను కలిగి ఉంది, వీటిలో 48 ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాల లోపల ఉండగా 19 బయట ఉన్నాయి.