ఎన్ రామ్ కు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు

    0
    12

    హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్ రామ్ కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు లభించింది.

    ఈ మేరకు పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను రాయ్ కు ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నవంబర్ 5న ప్రకటించింది. జాతీయ పత్రికా దినోత్సవం నవంబరు 16న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

    మరోవైపు గ్రామీణ పాత్రికేయ విభాగంలో రుబీ సర్కార్ (దేశ్బంధు పత్రిక), రాజేశ్ పరశురామ్ (పుఢారీ పత్రిక)లకు ‘ఎక్స్లెన్స్ ఇన్ జర్నలిజం’ అవార్డులను పీసీఐ ప్రకటించింది. అలాగే అభివృద్ధి పాత్రికేయ విభాగంలో వీఎస్ రాజేశ్ (కేరళ కౌముది), ఫోటో జర్నలిజంలో సుభాష్ పాల్ (రాష్టీయ్ర సహారా), మిహిర్ సింగ్ (పంజాబ్ కేసరి)లకు, వ్యంగ్య చిత్రాల విభాగంలో పి నరసింహా (నవ తెలంగాణ)కు కూడా అవార్డులను ప్రకటించింది.