ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ – ఉత్తమ విద్యా సంస్థల జాబితా

  0
  8

  జాతీయ స్థాయి ఉత్తమ విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు విద్యాసంస్థలు

  నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యా సంస్థల జాబితాను దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడుదల చేశారు.

  అన్ని విభాగాల్లో కలిపి జాతీయ స్థాయిలో మొత్తం (ఓవరాల్‌)గా 1,479 విద్యాసంస్థలు ఈ ర్యాంకింగ్‌లో పాల్గొనగా 99 సంస్థలకు ర్యాంకులు కేటాయించారు.

  దీనిలోఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు విద్యాసంస్థలకు స్థానం దక్కింది.

  ఏపీ నుంచి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర ,కేఎల్‌ యూనివర్సిటీలకు స్థానం దక్కింది.

  గతేడాది నాలుగు సంస్థలకు ర్యాంకులు లభించగా ఈసారి మూడింటికే పరిమితమయ్యాయి. అయితే ర్యాంకుల్లో మెరుగుపడ్డాయి.

  ఆంధ్ర వర్సిటీకి 2018లో 22వ ర్యాంకు లభించగా ఈ ఏడాది 16వ స్థానానికి దక్కింది.

  శ్రీ వెంకటేశ్వర వర్సిటీకి 2018లో 49వ స్థానంలో నిలవగా.. ఈసారి 48వ ర్యాంకు లభించింది.

  వైద్య విద్యా సంస్థల్లో 30 ర్యాంకులను ప్రకటించగా శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌ఐఎంఎస్‌)కు 29వ ర్యాంకు లభించింది.

  ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌లో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ (ఎస్‌పీఏ), విజయవాడకు 9వ ర్యాంకు లభించింది.

  న్యాయ కళాశాల విభాగంలో విశాఖపట్నంలోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ న్యాయ కళాశాలకు 15వ ర్యాంకు దక్కింది.

  డిగ్రీ కళాశాలల విభాగంలో 1,304 కళాశాలలు ర్యాంకులకు దరఖాస్తు చేయగా 100 కళాశాలలకు ర్యాంకులు ఇచ్చారు.

  వీటిలో ఏపీ నుంచి రెండు కళాశాలలకు స్థానం దక్కింది.

  విశ్వవిద్యాలయాల విభాగంలో (రాష్ట్రం నుంచి)

  2017లో ఏడు, 2018లో ఆరు వర్సిటీలకు స్థానం దక్కగా ప్రస్తుతం ఐదింటికే ర్యాంకులు లభించాయి.

  ప్రపంచ ర్యాంకింగ్‌లో మన విద్యా సంస్థలకు స్థానం దక్కాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ర్యాంకింగ్‌ వ్యవస్థను 2016లో ప్రవేశపెట్టింది.

  విద్యార్థుల సంఖ్య, అధ్యాపకులు- విద్యార్థుల నిష్పత్తి, నాణ్యమైన పరిశోధన పత్రాలు, పేటెంట్లు, పరిశోధన ప్రాజెక్టులు, ప్రాంగణ నియామకాలు, వేతనాలు, ప్రముఖ వర్సిటీల్లో ప్రవేశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు కేటాయించారు.

  ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ పేరిట మొత్తం 9 విభాగాల్లో ర్యాంకులను ప్రకటిస్తోంది.

  ఈ జాబితాను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ విడుదల చేస్తుంది.