ఎనిమిదేళ్లలో నిరుద్యోగం రెండింతలు – అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ

    0
    8

    దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ వెల్లడించింది.

     

    ఈ మేరకు ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)-2019 పేరిట ఏప్రిల్ 17న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్‌‌స సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ-సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016-18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు.

    నివేదికలోని అంశాలు…

    దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016-18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.

    పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయి.

    రూరల్ ఎంప్లారుుమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లారుుమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది.

    ఎస్‌డబ్ల్యూఐ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోరుున ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వర్సిటీ వెల్లడించింది.