ఉప్పు సత్యాగ్రహ సార్మకం పారంభం

  0
  80

  జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలోని దండిలో ఏర్పాటుచేసిన ‘జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియం’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు.

  ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ..‘మహాత్మా గాంధీ దండియాత్ర (ఉప్పు సత్యాగ్రహం) సందర్భంగా ఇది సాధ్యమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఉప్పుకున్న శక్తి, సమాజంలో వేర్వేరు వర్గాలతో దానికున్న అనుబంధం గాంధీకి తెలుసు. అందువల్లే బాపూ ముందుకు సాగారు’ అని అన్నారు. మరోవైపు గుజరాత్‌లోని సూరత్‌లో విమానాశ్రయం విస్తరణ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.

  ఉప్పు సత్యాగ్రహం  మహాత్మా గాంధీచే ప్రారంభించి సాగించిన అహింసాత్మక శాసనోల్లంఘన ఉద్యమం, ఇది బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా జరిగింది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన “దండి యాత్ర” నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సరమే ఈ ఉప్పు సత్యాగ్రహం.

  దీనిలో ప్రధానమైన గాంధీ యాత్ర సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమై దండి వరకూ సాగింది. ఈ యాత్రలో వేలకొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీగారి అహింసాత్మక ప్రతిఘటన విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ రాజ్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగానే కాక దానిని ప్రతీకగా వినియోగించుకుని మొత్తం భారతీయులపై బ్రిటీషర్ల అన్యాయమైన పరిపాలనపై ఒక శాంతియుత పోరాటం.