ఉద్యోగార్హ మానవ వనరుల్లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం

  0
  12

  ఉద్యోగ నైపుణ్య రంగం(ఎంప్లాయిబిలిటీ)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

  • పశ్చిమబెంగాల్, డిల్లీ వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. సర్వే ఆధారంగా ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2019 పేరుతో ఒక నివేదిక రూపొందించారు.
  • ఉద్యోగార్హ నైపుణ్య మానవవనరులపై సర్వేని పీపుల్ స్ట్రాంగ్, వీబాక్స్, భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించాయి. ఏఐసీటీఈ, యూఎన్డీపీ, అసోసియేషన్ ఆఫ్ యూనివర్శిటీస్ సంస్థలు సహకారమందించాయి.
  • 2019 జులై 15 నుంచి అక్టోబరు 30 మధ్య 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఐదు లక్షలకుపైగా విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. దీని ఆధారంగా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ పేరుతో నివేదిక సిద్ధం చేశారు. 2014 నుంచి ఇలా ఏటా నివేదికలు విడుదల చేస్తున్నారు.
  • గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. ‘ఎంప్లాయిబిలిటీ’కి సంబంధించి దేశంలోని 10 అగ్రశ్రేణి నగరాల జాబితానూ నివేదికలో పొందుపరుస్తారు. 2019 నివేదికలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరు, విశాఖపట్నం మొదటి పది నగరాల్లో చోటు దక్కించుకున్నాయి.