ఈసారి ఎన్నికల్లో ‘సఖి’ పోలింగ్ బూత్ లు

  0
  38

  మహిళా ఓటర్ల కోసం ఏర్పాటు
  రాష్ట్రంలోనే తొలిసారి అందుబాటులోకి..
  గ్రేటర్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 23 పోలింగ్ బూత్ లు

  మహిళలు పోలింగ్ బూత్ కు  తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేకంగా సఖీ (పింక్) పోలింగ్ బూత్ లను  అందుబాటులోకి తేనున్నారు. మహిళల చేత, మహిళల కొరకు… ఈ బూత్లను రూపొందిస్తారు. ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో 224 పింక్ పోలింగ్ బూత్ లను  ఏర్పాటు చేయగా… ఆయా బూత్ లలో  మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం గుర్తించారు. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోనూ పింక్ బూత్ లను  ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.