ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమం

  0
  12

  పదవీవిరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమం

  ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీవిరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలుకల్పించింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించినది .

  ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

  దీంతో ఇకనుంచి ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమమయింది

  అధిక పింఛను కోసం ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. దీనికి గడువేమీ లేదని తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ఈపీఎఫ్‌ పరిధిలో వేతన జీవులకు వారు పొందుతున్న వేతనాల మేరకు పింఛను లభించనుంది.

  ఈపీఎస్‌పై గరిష్ఠ పరిమితి ఉండటంతో అధిక వేతనాలున్నప్పటికీ పరిమితికి మించి చెల్లించేందుకు వీలు లేదు. తాజాగా సుప్రీం నిర్ణయంతో ఇప్పటివరకు సర్వీసుకు సంబంధించి అదనపు ఈపీఎస్‌ మొత్తాన్ని ఉద్యోగి చెల్లించాల్సి ఉంటుంది.