ఈడీ డైరెక్టర్ గా ఎస్.కె.మిశ్రా

  0
  14

  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పూర్తిస్థాయి డైరెక్టర్ గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఎస్.కె.మిశ్రా నియమితులయ్యారు.

  • ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2018 నవంబర్ 17న ఉత్తర్వులను వెలువరించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిశ్రా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా (రెంటింట్లో ఏది ముందైతే అది) పదవిలో ఉంటారు.
  • 2018 అక్టోబర్ 27న ఆదాయ పన్నుల శాఖ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్గా నియమితులైన మిశ్రాకు మూడు నెలల కాలానికి ఈడీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నాల్ సింగ్ స్థానంలో ఆయన ఈడీ బాధ్యతులు చేపట్టారు.
  • మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఈడీ డైరెక్టర్ హోదా..కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి పదవికి సమానం.