ఈజ్‌ సూచీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి మొదటి స్థానము.

  0
  7

  సంస్కరల అజెండాను సమర్థంగా అమలు చేసి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే (పీఎస్‌బీ) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) అగ్రస్థానంలో నిలిచింది.

   

  నీరవ్‌ మోదీ కుంభకోణం ఉదంతం ప్రభావం వెంటాడినప్పటికీ, వివిధ ప్రామాణిక అంశాల్లో ఈ బ్యాంకు అత్యుత్తమ పనితీరు కనబర్చడం గమనార్హం. వినియోగదారుల సమస్యలపై సత్వర స్పందన, రుణాల వృద్ధి డిజిటలైజషన్‌ సహా 6 విభాగాల్లో 140 అంశాల ఆధారంగా పీఎస్‌బీలకు ఈ ర్యాంకులను ఇచ్చారు. బీసీజీ- ఐబీఐ రూపొందించిన నివేదిక ప్రకారం.. ఈజ్‌ (ఎన్‌హాన్స్‌డ్‌ యాక్సెస్‌, సర్వీస్‌ ఎక్సలెన్స్‌) సూచీలో 100 పాయింట్లకు గాను పీఎన్‌బీ 78.4 పాయింట్లు పొంది మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బీఓబీ (77.8 పాయింట్లు), ఎస్‌బీఐ (74.6 పాయింట్లు), ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (69 పాయింట్లు), కెనరా బ్యాంకు (67.5 పాయింట్లు), సిండికేట్‌ బ్యాంక్‌ (67.1 పాయింట్లు) నిలిచాయి.

  బ్యాంకుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు, ఇతర బ్యాంకులతో పోలిస్తే అత్యుత్తమ పనితీరు కనబర్చేలా ప్రోత్సహించేందుకు ఈ ర్యాంకుల విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు.

  ఇక్కడ జరిగిన ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) కార్యక్రమంలో బీసీజీ- ఐబీఏ ర్యాంకుల నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కుంభకోణం ప్రభావంతో అన్ని విధాలా పీఎన్‌బీ ఇబ్బందులు ఎదుర్కొంది. మొండి బకాయిల కోసం తొమ్మిది నెలల్లో రూ.14,000 కోట్లను పక్కకు పెట్టింది.