ఇంధన సూచీలో భారత్‌కు 76వ ర్యాంక్

  0
  7

  అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్‌కు 76వ ర్యాంకు లభించింది.

   

  115 దేశాలతో రూపొందించిన ఈ జాబితాను ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) మార్చి 25న విడుదల చేసింది. ఈ జాబితాలో స్వీడన్ మరోసారి అగ్రస్థానంలో నిలవగా స్విట్జర్లాండ్, నార్వే వరుసగా రెండు, మూడు స్థానాలు పొందాయి. చైనా 82వ స్థానం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మంది విద్యుత్ వినియోగానికి దూరంగా ఉన్నట్టు ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అధిక జనాభాతోపాటు ఇంధన వ్యవస్థలో కార్బన్ డై ఆక్సైడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది.

  సూచీని ఇందన భద్రత, పర్యావరణ స్థిరత్వం, ఇంధన అందుబాటు వంటి అంశాలను వంటి పరిగణలోనికి తీసుకోని డబ్ల్యూఈఎఫ్ ఈ సూచీని రూపొందిస్తుంది. 2018లో విడుదల చేసిన అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్ 78వ స్థానం పొందింది. ఈ సంవత్సరము రెండు స్థానములు మెరుగుపర్చుకొని 76వ స్థానాన్ని పొందినది.

  గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ని ప్రతి సంవత్సరము వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరము ఏ జాబితాలో 115 దేశాలు చోటు సంపాదించుకున్నవి.