ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్

    0
    10

    మహిళ టీ20 ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది.

    మహిళల టీ20 ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డానియల్ వ్యాట్ (43; 37 బంతుల్లో 5×4, 1×6), హేదర్ నైట్ (25; 28 బంతుల్లో 1×4, 1×6) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో యాష్లె గార్డెనర్ (3/22), జార్జియా (2/11), మెగాన్ షుట్ (2/13) ప్రత్యర్థిని కట్టడి చేశారు. గార్డెనర్ (33 నాటౌట్; 26 బంతుల్లో 1×4, 3×6), మెగ్ లానింగ్ (28 నాటౌట్; 30 బంతుల్లో 3×4) సత్తా చాటడంతో లక్ష్యాన్ని ఆసీస్ 15.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీ20 ప్రపంచకప్ గెలవడం ఆస్ట్రేలియాకు ఇది నాలుగోసారి. 2014లో ఇంగ్లాండ్పైనే గెలిచి చివరిగా కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ సాధించింది. అప్పడు కూడా ఇంగ్లాండ్ ను 105 పరుగులకే కట్టడి చేసి లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.