ఆసియా షూటింగ్లో అంగద్ కు స్వర్ణం

  0
  12

  ఆసియా షాట్ గన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత షూటర్ అంగద్ వీర్ సింగ్ బాజ్వాకు స్వర్ణ పతకం లభించింది.

   

  కువైట్లో నవంబర్ 6న జరిగిన పురుషుల స్కీట్ విభాగం ఫైనల్లో 23 ఏళ్ల అంగద్ నిర్ణీత 60 పాయింట్లకుగాను 60 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం సాధించడంతోపాటు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీంతో ప్రపంచస్థాయిలో స్కీట్ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ షూటర్ గా అంగద్ గుర్తింపు పొందాడు. ఈ ఈవెంట్లో డి జిన్ (చైనా-58 పాయింట్లు) రజతం, సయీద్ అల్ మక్తూమ్ (యూఏఈ-46 పాయింట్లు) కాంస్యం గెలిచారు. గతంలో 59 పాయింట్లతో బెన్ లెవిలిన్ (బ్రిటన్), రికార్డో ఫ్లిపెల్లి (ఇటలీ), విన్సెంట్ హాన్కాక్ (అమెరికా), ఆడమ్స్ పాల్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అంగద్ తిరగరాశాడు.

  మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ ఈవెంట్లో ఇలవెనిల్ వలారివాన్-హృదయ్ హజరికా (భారత్) జోడీ స్వర్ణం, మెహులీ ఘోష్-అర్జున్ బబూటా (భారత్) జంట కాంస్యం సాధించాయి.