ఆసియా శ్రీమంతుల్లో అగ్రస్థానంలో హిందుజా కుటుంబం

  0
  4

  ఆసియా శ్రీమంతుల్లో హిందుజా కుటుంబం వరుసగా ఆరో ఏటా అగ్రస్థానంలో నిలిచింది.

   వీరి నికర సంపద ఏడాదిక్రితంతో పోలిస్తే 3 బిలియన్‌ పౌండ్లు పెరిగి 25.2 బిలియన్‌ పౌండ్లకు చేరింది.

  2019 సంవత్సరానికి గాను బ్రిటన్‌లో అగ్రగామి 101 మంది ఆసియా శ్రీమంతుల జాబితాను విడుదల చేసింది. గత 12 ఏళ్లలో అసాధారణ వ్యాపార పనితీరు ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది.

  అర్సెల్లర్‌ మిత్తల్‌ అధినేత లక్ష్మీ మిత్తల్‌, ఆయన తనయడు ఆదిత్యా మిత్తల్‌ రెండో స్థానంలో నిలిచారు. వీళ్ల సందప 2.8 బిలియన్‌ పౌండ్లు తగ్గి 11.2 బిలియన్‌ పౌండ్లకు పరిమితమైంది. 5.8 బిలియన్‌ పౌండ్లతో ఎస్‌పి లోహియాకి మూడో స్థానం లభించింది.

  మరో ప్రవాస భారతీయ వ్యాపారవేత్త లార్డ్‌ స్వరాజ్‌ పాల్‌ 17వ స్థానం పొందారు. జాబితాలోని 101 మంది శ్రీమంతుల మొత్తం సంపద సగటున 5 బిలియన్‌ పౌండ్లు పెరిగి 85.2 బిలియన్‌ పౌండ్లకు చేరింది.