ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

  0
  12

  ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు రేట్లు పెంచిన కేంద్ర బ్యాంకు తన ‘సమయానుకూల కఠిన’ వైఖరిని మాత్రం కొనసాగించింది. ద్రవ్యోల్బణ అంచనాలు దిగువకు సవరించినప్పటికీ.. ముడి చమురు ధరలు, పలు ఇతర అనిశ్చితులు ఇంకా ద్రవ్యోల్బణం చుట్టూ మబ్బులా ఉన్నాయ’ని పరపతి విధాన సమీక్ష సందర్భంగా ప్రకటించింది.

  ముఖ్యాంశాలు

  * కీలక రుణ రేటు(రెపో) 6.5 శాతం వద్దే.
  * రివర్స్‌ రెపో రేటు 6.25%; బ్యాంక్‌ రేటు 6.75%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)ని 4 శాతం వద్ద కొనసాగింపు.
  * అక్టోబరు-మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనా 2.7-3.2 శాతం.
  * ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.4 శాతం వద్దే కొనసాగింపు.
  * 2019-20 ఏప్రిల్‌-సెప్టెంబరు వృద్ధి 7.5% నమోదు కావొచ్చని అంచనా కట్టింది. అయితే ఇంకా తగ్గడానికి అవకాశాలను కొట్టిపారేయలేదు.
  * దేశీయ స్థూల ఆర్థిక మూలాలను బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని ఆర్‌బీఐ భావిస్తోంది.
  * తక్కువ రబీ సాగు వ్యవసాయంపై, గ్రామీణ గిరాకీపై ప్రభావం చూపవచ్చు.
  * ముడి చమురు ధరలు తగ్గుతుండడం వృద్ధికి ఊతమిచ్చే అంశం.
  * ఆర్థిక మార్కెట్ల ఊగిసలాట, అంతర్జాతీయ గిరాకీ మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు కలిసి ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.