ఆరావళి పర్వతాలకు నష్టము చేయద్దు  – సుప్రీంకోర్టు

  0
  11

  ప్రఖ్యాత ఆరావళి పర్వాతాలకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని హరియాణా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది.

  ఆరావళి పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతినిస్తూ హరియాణా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

  ఆ నిర్మాణాల వల్ల పర్వతాలకు హాని కలిగితే మాత్రం మీరు(రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) సమస్యల్లో చిక్కుకున్నట్లేనని హెచ్చరికలు చేసింది.

  ఆరావళి పర్వత ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌కు అనుమతినిచ్చేలా హరియాణా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది.

  ఈ సవరణలకు ఫిబ్రవరి 27న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.

  దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరియాణా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా చట్టాన్ని అమలు చేయరాదంటూ ఈ నెల 1న ఆదేశాలు జారీ చేసింది.

  జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది.