ఆంధ్ర ప్రదేశ్ లో బిల్డ్ ఏపీ మిషన్

  0
  5

  సీఎం జగన్ మరో కీలక పథకం ప్రారంభించనున్నారు.దీనిద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

  ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పథకం బిల్డ్ ఏపీ మిషన్.విజయవాడలో బిల్డ్ ఏపీ మిషన్ తొలి ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించారు.

  పథకం అమల్లో భాగంగా నిధుల సమీకరణ కోసం రెండెకరాల భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. బిల్డ్ ఏపీ మిషన్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న రెండెకరాల భూమిని విక్రయించే దిశగా చర్యలు చేపట్టింది.

  స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని విక్రయించే అవకాశం ఉంది. అధునాతన భవనాల కోసం, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశం.

  ఈ స్థలం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ తరహా ప్రాజెక్టులు వస్తే అభివృద్ధితోపాటు ఉపాధి కల్పన కూడా ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.

  ఎన్బీసీసీ సంస్థతో కలిసి బిల్డ్ ఏపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు వాటిని విక్రయించాలని నిర్ణయించింది.

  బిల్డ్ ఏపీ మిషన్ డైరక్టర్ గా ప్రవీణ్ కుమార్