ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ : 2019-20 ముఖ్యాంశాలు

  0
  4

  మొత్తం రూ.2.26 లక్షలతో ఏపీ బడ్జెట్
  గతేడాది కన్నా 18.38 శాతం పెరిగిన బడ్జెట్
  ఆర్థిక లోటు అంచనా రూ.32,390.68 కోట్లు

  ఆంధ్రప్రదేశ్ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. వరసగా మూడోసారి యనమల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెన్ ప్రభుత్వం రూపొందించింది. గతేడాది కన్నా బడ్జెట్ 18.38 శాతం పెరిగింది. దీనిలో రెవెన్యూ వ్యయం రూ.1.80 లక్షల కోట్లగా ఉంది. ఆర్థిక లోటు అంచనా రూ.32,390.68 కోట్లు. కేపిటల్ వ్యయం రూ.29,596.33 కోట్లు. రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,48,744 కోట్ల అప్పు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ అప్పు రూ.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు.

  రంగాల వారీగా బడ్జెట్‌లో కేటాయింపులు..

  ఆర్థికశాఖకు రూ.51,841.69 కోట్లు

  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.35,182.61 కోట్లు

  జలవనరుల శాఖకు రూ.16,852.47 కోట్లు

  వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు

  వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.10,032.15 కోట్లు

  వృద్ధాప్య, వితంతు పింఛన్లకు రూ.10,401 కోట్లు

  బీసీ సంక్షేమానికి రూ.8,242.64 కోట్లు

  మున్సిపల్ శాఖకు రూ.7,979.34 కోట్లు

  హోం శాఖకు రూ.6397.94 కోట్లు

  రోడ్లు భవనాలు, రవాణా శాఖకు రూ.5,382 కోట్లు