ఆంధ్రప్రదేశ్ లో భారీ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు

  0
  7

  తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.46,675 కోట్లతో భారీ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

  లక్ష్యం – 2022 నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారానే మంచినీరు సరఫరా చేయడం

  గ్రామీణ ప్రాంతాల్లోని 46,982 నివాసిత ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని 110 పట్టణ, నగర పాలక ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు.

  మొదటి దశలో రూ.37,475 కోట్లు, రెండో దశలో రూ.9,200 కోట్లు ఖర్చు చేయనున్నారు.

  రుణం – ఈ ప్రాజెక్టు అమలుకు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) నుంచి రూ.2,500 కోట్ల రుణం అందనుంది.

  నీటీ మార్గం – సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు.

  గిరిజన ప్రాంతాల్లో నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తారు.