ఆంధ్రప్రదేశ్ కు నూతన పరిపాలన నియమావళి

  0
  13

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా నియమావళి (బిజినెస్ రూల్స్)లోని నిబంధనల్ని 59 నుంచి 22కి కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • కొన్ని సవరణతో సిద్ధం చేసిన ప్రభుత్వ పరిపాలనా నియమావళి-2018ని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠ 2018 2018 నవంబర్ 28న ఉత్తర్వు జారీ చేశారు.
  • ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, విభాగాధిపతుల విధి విధానాలు, మంత్రివర్గ సమావేశాలు ఎలా నిర్వహించాలి? మంత్రి వర్గ ఉపసంఘాలు, స్థాయీ సంఘా నియామకం ఎలా జరగాలి? వంటి సమగ్ర వివరాలతో బిజినెస్ రూల్స్ ని సిద్ధం చేశారు.
  • ప్రభుత్వ శాఖలు, జిల్లాకు రేటింగ్ ఇచ్చేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. రామ్స్ అప్లికేషన్లో అన్ని ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు తాజా సమాచారం నమోదు చేయాలని సూచించారు.