ఆంధ్రప్రదేశ్‌కు స్కోచ్‌ అవార్డులు

  0
  8

  ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డులలో ఆంధ్రప్రదేశ్‌ తన సత్తా చుపించింది.

  ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ సంస్థ ప్రకటించిన పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏడు అవార్డులు గెలువగ గృహనిర్మాణ శాఖ 12 అవార్డులు గెలుచుకుంది . ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు రాష్ట్రంలో ఆరోగ్యశాఖ చేపట్టిన పథకాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది.

  ఇప్పటికే జాతీయ స్థాయిలో 53 అవార్డులు అందుకున్న ఆరోగ్యశాఖ ఖాతాలోకి తాజాగా మరో 7 పురస్కారాలు వచ్చి చేరాయి. స్కోచ్‌ పురస్కారాల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ రెండు గోల్డెన్‌, ఐదు సిల్వర్‌ అవార్డులు సాధించింది. వీటితో కలిపి ఈ ఐదేళ్లలో ఆరోగ్యశాఖ మొత్తం 60 జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నట్టయింది.

  పట్టణ ప్రాంత పేద రోగులకు స్పెషాలిటీ సేవలు అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్రంలో చేపట్టిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, టీబీ కంట్రోల్‌ కార్యక్రమాల ద్వారా అందిస్తున్న సేవలకు గాను స్కోచ్‌ సంస్థ గోల్డెన్‌ అవార్డులు ప్రకటించింది. ఈ-సబ్‌ సెంటర్లు, పీడర్‌ అంబులెన్సులు (గిరిజన ప్రాంతాల్లో ఉన్నవి), సదరం, మినీ ఎస్‌ఎన్‌సీయూ, మహాప్రస్థానం పథకాలకు సిల్వర్‌ అవార్డులు లభించాయి.