ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

  0
  10

  ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు.

  ⇒  ఒడిశాకు చెందిన భాజపా నేత, మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నవ్యాంధ్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కొనసాగుతూ వచ్చారు.

  ⇒  85 ఏళ్ల బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరి ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద జైలుకెళ్లారు.

  ⇒  భాజపా ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో జనతాపార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

  ⇒  1996లో తిరిగి భాజపాలో చేరారు. న్యాయ విద్యలో పట్టభద్రుడైన ఈయన భాజపా-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు(రెండు పర్యాయాలు) పరిశ్రమలు, రెవెన్యూ, న్యాయశాఖల మంత్రిగా సేవలందించారు. భువనేశ్వర్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు, చిలికా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  ⇒  హరిచందన్‌ రచయిత కూడా. శేష ఝలక్‌, అస్తాశిఖా, రాణాప్రతాప్‌, మానసి, మారు బతాస్‌ తదితర పుస్తకాలు రచించారు.