ఆండీ ముర్రేకు సర్ బిరుదు

  0
  26

  మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, రెండు ఒలింపిక్ స్వర్ణాల విజేత అయిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘సర్’ బిరుదుతో సత్కరించింది.

  మే 16న జరిగిన కార్యక్రమంలో ముర్రేకు ప్రిన్స్ చార్లెస్ ‘నైట్‌హుడ్’ పురస్కారాన్ని అందజేశారు. 2013లో వింబుల్డన్ గెలిచి 77 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన బ్రిటన్ ఆటగాడిగా గుర్తింపు పొందిన ముర్రే 2016లో ఇదే టైటిల్‌ను గెలుచుకున్నాడు.

  అంతకు ముందు 2012లో అతను యూఎస్ ఓపెన్ నెగ్గాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించిన ముర్రే ఇటీవల వరుస గాయాలతో ఆటకు దూరమయ్యాడు.

  బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న తుంటి గాయంతో ఈ మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో 31 ఏళ్ల ముర్రే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ – 2019 తర్వాత తాను రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు.