అస్మా జహంగీర్‌కు యూఎన్‌ఓ మానవహక్కుల పురస్కారం-2018

    0
    10

    పాకిస్తాన్‌ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్‌(66)కు అరుదైన గౌరవం దక్కింది.

     # ఐక్యరాజ్యసమితి ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవహక్కుల పురస్కారం-2018 అస్మాను మరణానంతరం వరించింది.

    # పాకిస్తాన్‌లో సైనిక జోక్యానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అస్మా 2018 ఫిబ్రవరిలో గుండెపోటుతో మృతి చెందారు.

    # న్యూయార్క్‌లో 2018 డిసెంబర్‌ 18న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్నాండా ఈ అవార్డును అస్మా కుమార్తె మునైజే జహంగీర్‌కు అందజేశారు.

    # అస్మాతో పాటు టాంజానియాలో బాలికా విద్య కోసం ఉద్యమిస్తున్న రెబెకా గ్యుమీ, బ్రెజిల్‌లో తొలి ఆదివాసీ మహిళా న్యాయవాది జోనియా బటిస్టా, ప్రపంచవ్యాప్తంగా హక్కు కార్యకర్తల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ డిఫెండర్స్‌(ఐర్లాండ్‌)కు 2018కి గానూ ఈ మానవహక్కుల పురస్కారం లభించింది.