అసోచామ్‌ నివేదిక – 2019

    0
    9

    భారత్‌ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్‌-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది.

    ముఖ్యాంశాలు

     మీడియా-వినోద రంగంపై దేశ తలసరి వ్యయం 2021 నాటికి 32 డాలర్ల (రూ.2,080)కు చేరే అవకాశం ఉంది.

     ప్రపంచంలోనే ఓటీటీ (కోరుకున్న వీడియోల వీక్షణ) విపణిలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి.

    2022 నాటికి ఈ మార్కెట్‌ 52.68 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.6 లక్షల కోట్లకు) చేరవచ్చు. ఇది 2017లో 30.36 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

    కారణం:

    ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం దేశంలో బాగా పెరగడం, డేటా ఛార్జీలు తగ్గడం ఓటీటీ కంటెంట్‌ వృద్ధికి దోహదపడుతున్నాయి.

     ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్‌ 2017-22 మధ్య కాలంలో 10.1% వార్షిక వృద్ధి (సీఏజీఆర్‌) సాధించే అవకాశం ఉంది.

     2021 నాటికి భారత్‌ మీడియా, వినోద తలసరి వ్యయం రూ.2,080 . చైనా (రూ.14,430), అమెరికాలతో (రూ.1.46 లక్షలు) పోలిస్తే మాత్రం ఇది చాలా తక్కువ.

    భారత్‌లో వీడియో-ఆన్‌-డిమాండ్‌ విభాగంలో ఎంపిక అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. ప్రధానంగా హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఎరోస్‌ నౌ తదితర సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి.