అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాషగా తెలుగు

  0
  13

  ఈ మేరకు 2010-17 కాలంలో అమెరికాలో ఇంగ్లీషు మినహా ఇతర భాషలపై అధ్యయనం చేసిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ అక్టోబర్ 22న వెల్లడించింది.

  2017లో యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. ప్రపంచ వాణిజ్య సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010-17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది.

  అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-10 భాషల్లో ఏడు దక్షిణాసియా భాషలు ఉన్నాయి. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు. అందులో అధికంగా స్పానిష్ మాట్లాడేవారున్నారు. యూఎస్‌లో భారతీయ భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు అధికంగా ఉండగా తర్వాతి స్థానంలో గుజరాతీ మాట్లాడేవారున్నారు.
  .