అమరావతి లో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహం

  0
  17

  60 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు – 200 ఎకరాల్లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు – ప్రత్యేక ట్రస్టు ద్వారా విరాళాల సేకరణ

  రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తైన కొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ స్మారక(మెమోరియల్‌) ప్రాజెక్టు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్‌ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

  ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు ముఖ్యాంశాలివి..

  • నీరుకొండలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహం లోపలి భాగంలో పైవరకు వెళ్లి అక్కడినుంచి నగరాన్ని వీక్షించవచ్చు. సందర్శకులు పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లుంటాయి.
  • జలాశయం దాటి కొండ వద్దకు చేరుకోడానికి బోట్లు ఏర్పాటుచేస్తారు. వాహనాలలో వెళ్లేందుకు కాజ్‌వే కూడా ఉంటుంది. ప్రాజెక్టులో ప్రధానంగా పది విభాగాలుంటాయి.
  • కొండ దిగువ ప్రాంతంలో ఒక ప్రధాన జెట్టీ ఉంటుంది. అక్కడే ఒక ఫనిక్యులర్‌ రైల్వేస్టేషన్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, రెస్ట్‌రూమ్‌లు, ఫుడ్‌కోర్టు, సెల్ఫీపాయింట్‌ ఉంటాయి.
  • కొండ దిగువ నుంచి కొండపైకి చేరుకోడానికి ఫనిక్యులర్‌ రైలు ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలపైకి వెళ్లేందుకు ట్రాక్‌పై నడిచే కారునే ఫనిక్యులర్‌ ట్రైన్‌ అంటారు.
  • ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేసే భవనంలో.. మ్యూజియం, ఆడిటోరియం, కేఫ్‌, ఫనిక్యులర్‌ స్టేషన్‌ ఉంటాయి.
  • భవనం పక్కనే ఒక యాంఫీ థియేటర్‌ ఉంటుంది.
  • కాజ్‌వే నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేసిన భవనం వరకు వాహనాల్లో చేరుకోడానికి రోడ్డు మార్గం ఉంటుంది.
  • కొండపైకి వెళ్లేందుకు నడక మార్గం, రెండో జెట్టీ వంటివి ఏర్పాటుచేస్తారు.
   * కొండపై అరుదైన వృక్షజాతులతో ఉద్యానవనం ఏర్పాటుచేస్తారు.

  ప్రాజెక్టు ప్రత్యేకతలు

  • విగ్రహం ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయిస్తారు. నీరు కొండ చుట్టూ 7080 ఎకరాల్లో జలాశయం నిర్మిస్తారు. మొత్తం ప్రాజెక్టును 200 ఎకరాల్లో చేపడతారు.
  • ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా. విగ్రహం నిర్మాణానికి రూ.155 కోట్లు, విగ్రహం ఏర్పాటుచేయడానికి నిర్మించే భవనానికి మరో రూ.112.5 కోట్లు ఖర్చవుతాయి.
  • 42 మీటర్ల ఎత్తైన, 9700 చ.మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాన్ని నిర్మిస్తారు. జీ+3 విధానంలో నిర్మించే ఈ భవనంపై టెర్రాస్‌ ఉంటుంది. దానిపై పోడియం వస్తుంది. భవనం సెంట్రల్‌ కోర్‌పై ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేస్తారు. టెర్రాస్‌ ఓపెన్‌గా ఉంటుంది.