అన్ని పాఠశాలల్లో ‘భాషా పరిచయం’

  0
  13

  దేశంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తప్పకుండా ‘భాషా పరిచయం’ కార్యక్రమంను అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) నిర్ణయించింది.

  ఈ మేరకు నవంబర్ 23న ఆదేశాలు జారీ చేసింది. దేశ భాషలపై విద్యార్థులకు కనీస అవగాహనను కల్పించేందుకు భాషా పరిచయం కార్యక్రమంను ఎంహెచ్‌ఆర్‌డీ రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయిలోనే దేశ భాషలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే… ముఖ్యమైన పదాలపై కొంతమేర పట్టు రావడంతో పాటు జాతీయ సమగ్రత పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

  ప్రార్థన సమయంలో ఉచ్ఛారణ...
  భాష పరిచయం కార్యక్రమంలో భాగంగా ప్రార్థనా సమయంలో కనీసం 5 పదాలను విద్యార్థులు ఉచ్ఛరించేలా ఎంహెచ్‌ఆర్‌డీ ప్రణాళిక రూపొందించింది. నమస్కారం, మీ పేరు ఏమిటి?, నా పేరు, మీరు ఎలా ఉన్నారు? వంటి ప్రశ్నలు, సమధానాలు ఇచ్చి వాటిపై అవగాహన కల్పించనుంది. నిర్దేశించిన వాక్యాలను రోజుకొక భాష వంతున డిసెంబర్ 21లోపు దేశంలోని అధికారిక భాషలైన 22 భాషల్లో పరిచయం పూర్తి చేయనుంది.