అన్నదాతా సుఖీభవ’ పథకం 

  0
  23

  రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద ఐదెకరాల లోపు రైతులకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని నిశ్చయించారు.

  గత కేబినెట్‌ సమావేశంలో రూ.10 వేలే ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

  ఐదెకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం ప్రకటించిన పెట్టుబడి సాయం రూ.6 వేలకు అదనంగా మరో రూ.9 వేలు కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుంది. అంటే ఐదెకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ రూ.15 వేలు చొప్పున లభించనున్నాయి.

  ఐదెకరాలు దాటిన రైతులకు కేంద్రం ఏమీ ప్రకటించకపోయినా రాష్ట్రప్రభుత్వమే ‘అన్నదాతా సుఖీభవ’ కింద రూ.10 వేలివ్వాలని నిర్ణయం తీసుకుంది.