అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్

  0
  4

  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని 2019 ఎడెల్‌మన్ ట్రస్ట్ బారోమీటర్ రిపోర్ట్ వెల్లడించింది.

  ప్రభుత్వం, వ్యాపారం, స్వచ్చంద సేవా సంస్థలు, మీడియా అంశాల పరంగా చూస్తే, అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. భారత్ బ్రాండ్లు మాత్రం అత్యంత స్వల్ప విశ్వసనీయ బ్రాండ్లుగా నిలిచాయి.

  మరోవైపు గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో ఈ ఏడాది భారత్ ఒక స్థానం ఎగబాకి 80వ స్థానానికి చేరింది. ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్, టాటా కమ్యూనికేషన్స్, ఏడెక్కో గ్రూప్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగింది.

  ప్రపంచ ఆర్థిక వృద్ధిలో చైనా పాత్రను భర్తీ చేయగలిగే సత్తా భవిష్యత్తులో భారత్‌కు ఉందని స్పైస్‌జెట్‌ సీఈఓ అజయ్‌ సింగ్‌ చెప్పారు. భారత్‌లో అధికారంలో ఎవరు ఉన్నా, ఆర్థిక విధానాలపై ఏకాభిప్రాయం ఉంటుందని, వృద్ధి జోరు కొనసాగుతుందని, భారత్‌కు ఉన్న వినూత్నమైన ప్రయోజనం ఇదేనని పేర్కొన్నారు. వృద్ధి జోరు కొనసాగుతుందని డబ్ల్యూఈఎఫ్‌ సమావేశంలో చెప్పారు.