అణుశక్తి నియంత్రణ మండలి చైర్మన్ గా గుంటూరు నాగేశ్వరరావు

  0
  14

  అణుశక్తి నియంత్రణ మండలి (AERB) చైర్మన్ గా గుంటూరు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన ఈ బాధ్యతల్లో 3 సం॥లు కొనసాగుతారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

  న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో పని చేసిన కాలంలో నాగేశ్వరరావు ప్రతిభ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అణుశక్తి నియంత్రణ మండలిలో ప్రాజెక్టు డిజైన్ సేఫ్టీ కమిటీ చైర్మన్గా ప్రస్తుతం నాగేశ్వరరావు కొనసాగుతున్నారు. ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రాజెక్టులకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు.
  • న్యూక్లియర్ రంగంలో సీనియర్ శాస్త్రవేత్త అయిన నాగేశ్వరరావు గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో జన్మించారు. అనంతపురం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
  • 1975లో భారత అణు ఇంధన విభాగంలో చేరారు. ‘వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేషన్స్ (వానో) ఆయనకు ‘న్యూక్లియర్ ఎక్స్లెన్స్’ పురస్కారం అందించింది.
  • సురక్షిత, సమర్థ, విశ్వసనీయ అణు విద్యుత్తు కేంద్రా నిర్వహణకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, అనుభవానికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది.