అగ్రి-మార్కెట్‌ మౌలిక సదుపాయాల నిధి (ఏఎంఐఎఫ్‌) ఏర్పాటు

  0
  8

  రూ.2,000 కోట్లతో అగ్రి-మార్కెట్‌ మౌలిక సదుపాయాల నిధి (ఏఎంఐఎఫ్‌) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

  గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, క్రమబద్ధీకరించిన టోకు మార్కెట్ల అభివృద్ధి, స్థాయి పెంపునకుగాను రూ.2,000 కోట్లతో అగ్రి-మార్కెట్‌ మౌలిక సదుపాయాల నిధి (ఏఎంఐఎఫ్‌) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

  ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్రమంత్రివర్గం పలు ప్రతిపాదనల్ని ఆమోదించింది.

  సమావేశం వివరాలను కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 10,000 గ్రామాలు, 585 మార్కెట్‌ కమిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికిగాను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రాయితీ రుణాలను ఏఎంఐఎఫ్‌ అందిస్తుంది.

  పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన ప్రాజెక్టులతో సహా సమీకృత మార్కెట్‌ వసతుల కోసం రాష్ట్రాలు ఏఎంఐఎఫ్‌ను వినియోగించుకోవచ్చు.