అంగారక గ్రహంపై దిగిన ఇన్ సైట్

    0
    12

    అంగారక గ్రహం అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ప్రయోగించిన రోబో ఆధారిత ల్యాండర్ ‘ఇన్ సైట్ ’ విజయవంతంగా గ్రహంపై దిగింది.

    ఈ మేరకు ఇన్ సైట్ సుమారు ఆరు నెలలపాటు ప్రయాణం చేసి అంగారకుడి మధ్యరేఖ ‘ఎలీసియమ్ ప్లానీషియా’కు దగ్గర్లో దిగిందని నవంబర్ 27న నాసా వెల్లడించింది. రెండు, మూడు నెలల్లో రోబో..ఈ మిషన్లో అంతర్భాగమైన సీస్మిక్ ఎక్స్పరిమెంట్ ఇంటీరియర్ స్ట్రక్చర్(సీస్), హీట్ ఫ్లో అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ప్యాకేజ్(హెచ్పీ3) పరికరాల్ని మోహరిస్తుంది. వీటితోనే అంగారకుడి సమాచారం పొందడానికి వీలవుతుంది.

    ఇన్ సైట్ వెంట పంపిన రెండు చిన్న ఉపగ్రహాలు(మార్కో క్యూబ్శాట్స్) అంగారకుడిపై  ఇన్ సైట్ కదలికల్ని పరిశీలించి ఆ చిత్రాల్ని భూమికి పంపుతాయి. ఈ ప్రయోగంతో అంగారక గ్రహంపైకి నాసా చేపట్టిన 8వ మిషన్ విజయవంతమైనట్లయింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి మే 5న ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ల్యాండర్ 2020, నవంబర్ 24 వరకు సేవలందించనుంది.